Mukesh Ambani: ఒబెరాయ్ హోటల్ వేదికగా ఐదు రోజుల వేడుక: అట్టహాసంగా సాగనున్న రిలయన్స్ వారసుడి వివాహం

  • నాలుగు రోజుల క్రితం నిశ్చితార్థం
  • డిసెంబర్ రెండో వారంలో పెళ్లి
  • హాజరు కానున్న దేశ విదేశీ అతిథులు
నాలుగు రోజుల క్రితం గోవాలో సన్నిహితులు, దగ్గరి బంధువుల మధ్య నిశ్చితార్థం చేసుకున్న ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాల వివాహం డిసెంబర్ రెండో వారంలో అత్యంత వైభవంగా జరగనుందని తెలుస్తోంది. వీరిద్దరి వివాహం డిసెంబర్ 8 నుంచి 12 మధ్య, ముంబైలోని ఓబెరాయ్ హోటల్ లో వివాహం జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ విషయంలో అధికారికంగా సమాచారం వెలువడనప్పటికీ, ఈ పెళ్లికి పలువురు ప్రముఖులు దేశ విదేశాల నుంచి తరలివస్తారని తెలుస్తోంది. కాగా, ఈ రెండు కుటుంబాల మధ్య చాలా సంవత్సరాలుగా పరిచయం ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిలయన్స్ టెలికం వెంచర్ జియో బోర్డులో డైరెక్టర్ ఉన్న ఆకాశ్, కనెక్ట్ ఫర్ అనే కంపెనీని స్థాపించి స్వచ్ఛంద సేవలు అందిస్తున్న శ్లోకా ప్రేమించుకోగా, వారి వివాహానికి రెండు కుటుంబాలూ అంగీకరించాయి.
Mukesh Ambani
Akash Ambani
Sloka Mehta
Marriage
Engagement

More Telugu News