YSRCP: విజయసాయిరెడ్డితో దళారీ పనులు చేయిస్తున్నారు: మంత్రి దేవినేని

షార్ట్స్‌లో చూడండి
విజయసాయిరెడ్డితో దళారీ పనులు చేయించి కేసుల నుంచి బయటపడాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పలు అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ బెయిల్ కోసం నాడు యూపీఏ సర్కార్ తో కుమ్మక్కయ్యారని, నేడు కేసుల మాఫీ కోసం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డిలతో జగన్ ఎందుకు రాజీనామా చేయించట్లేదు? కేవలం వైసీపీ చెందిన లోక్ సభ సభ్యులతోనే రాజీనామా డ్రామాలేంటి? అని ప్రశ్నించారు. 
Go Back to Shorts
YSRCP
Jagan
devineni

More Telugu News