Telangana: ఏపీకి ఏ హామీ ఇచ్చినా కేంద్రం నెరవేర్చాల్సిందే : ఎంపీ కవిత

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ఏ హామీ ఇచ్చినా కేంద్రం నెరవేర్చాల్సిందేనని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు.పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం నిమిత్తం తమ పార్టీ ఎంపీలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా లేదా సాయం..ఇస్తామన్నది ఇవ్వాల్సిందేనని సూచించారు. అయితే, రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందనడం సబబు కాదన్న కవిత, తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆమె స్పందిస్తూ.. ‘దున్నపోతుపై వానపడినట్టుగా ఉంది’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కలిసి పోరాడితేనే కేంద్రంపై విజయం సాధించలగమని, రెండు రాష్ట్రాలూ బాగుండాలన్నదే తమ అభిమతమని అన్నారు.
Go Back to Shorts
Telangana
mp kavita

More Telugu News