charmy: నా ప్రేమ విఫలమైంది .. పెళ్లిపై నాకు నమ్మకం లేదు : ప్రముఖ నటి ఛార్మి

  • సినీ ఇండస్ట్రీలో ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను
  • రెండు విషయాల వల్ల మా ప్రేమ విఫలమైంది
  • ఒకవేళ అతన్ని పెళ్లి చేసుకుంటే విడాకులు తీసుకోక తప్పేది కాదు
  • ‘పెళ్లి’ అనేది నా విషయంలో జరగదు : నటి ఛార్మి
తన ప్రేమ విఫలమైందని, పెళ్లి పై తనకు నమ్మకం లేదని ప్రముఖ నటి ఛార్మి చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, విఫలమైన తన ప్రేమ, పెళ్లిపై ఆసక్తి లేకపోవడానికి గల కారణాలను ఆమె బయటపెట్టింది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని, రెండు విషయాల వల్ల తమ ప్రేమ విఫలమైందని చెప్పింది. ఒకవేళ, అతన్ని తాను పెళ్లి చేసుకున్నట్టయితే ఆ రెండు విషయాల కారణంగా తాము విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడేదని తెలిపింది. అయితే, అతను మంచివాడేనని, తానే చెడ్డదానినని చెప్పడం గమనార్హం. పెళ్లి చేసుకోమని తనపై తన తల్లి ఒత్తిడి చేస్తూ ఉంటుందని, రిలేషన్ షిప్ లో సరిగ్గా ఇమడలేని తాను పెళ్లి చేసుకుని ఏం సాధిస్తానని చెప్పింది. ఒకవేళ తాను పెళ్లి చేసుకున్నా తన భర్త కోసం సమయం కేటాయించలేనని, ఇంటి పనులు చూసుకోలేనని ఛార్మి స్పష్టం చేసింది. అసలు, తనకు పెళ్లిపై నమ్మకం లేదని, ‘పెళ్లి’ అనేది తన విషయంలో జరగని పని అని చెప్పిన ఛార్మి, తన తల్లిదండ్రులతోనే ఉండిపోవాలని అనుకుంటున్నట్టు చెప్పింది.
charmy
Tollywood

More Telugu News