Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు భద్రత పెంచిన చంద్రబాబు సర్కారు... ఇకపై ఆయుధాలతో 2+2!

  • రెండు షిప్టుల్లో నలుగురు గన్ మెన్లు
  • భద్రతను కల్పించాలని డీజీపీని కోరిన పవన్
  • గుంటూరు సభ సందర్భంగా పవన్ విజ్ఞప్తి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భద్రతను పెంచాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై సాయుధులైన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఆయన వెంట అనుక్షణం ఉంటారు. ఈ మేరకు '2 ప్లస్ 2' విధానంలో నలుగురు సిబ్బందిని కేటాయిస్తూ, ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. ఇటీవల గుంటూరులో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగిన వేళ, తనకు సెక్యూరిటీ కావాలని డీజీపీని పవన్ కల్యాణ్ కోరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పోలీసు శాఖ నలుగురు గన్ మెన్లను రెండు షిప్టుల్లో కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది.
Pawan Kalyan
Jana Sena
Chandrababu
Andhra Pradesh

More Telugu News