TRS: మా బాసే ప్రధాని కావచ్చు: టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • 2019లో ఏమైనా జరగవచ్చు
  • బీజేపీతో పొత్తయినా ఏమైనా సరే
  • వేచి చూస్తే తెలుస్తుందన్న జితేందర్ రెడ్డి
2019 ఎన్నికల తరువాత తమ బాస్ కేసీఆర్ ప్రధానమంత్రి అయి, దేశాన్ని తామే లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, పార్లమెంట్ ఎన్నికల తరువాత ఏదైనా జరగవచ్చని అన్నారు. "బీజేపీతో పోస్ట్ అలయన్స్ కావచ్చు... మా బాసే ప్రధానమంత్రి కావచ్చు... మేమే లీడ్ చేయవచ్చు... ఏదైనా కావచ్చు ఆ రోజు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ వాటీజ్ హ్యాపెనింగ్" అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగిందని వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు. కేసీఆర్ అధినాయకత్వంపై ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉందని తెలిపారు.
TRS
Jitender Reddy
KCR

More Telugu News