somu veeraj: ‘పట్టిసీమ’పై సోము వీర్రాజువి అర్థంలేని ఆరోపణలు : బుచ్చయ్య చౌదరి

  • ‘పట్టిసీమ’పై సోము వీర్రాజు వ్యాఖ్యలన్నీ అబద్ధాలే
  •  సోము వీర్రాజుకు దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలి
  • మోదీ, అమిత్ షా నియంతల్లా వ్యవహరిస్తున్నారు
  • మీడియాతో బుచ్చయ్య చౌదరి
‘పట్టిసీమ’పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పట్టిసీమ’పై ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలిచే సత్తా సోము వీర్రాజుకు లేదని అన్నారు. దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి సోము వీర్రాజు రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. గతంలో అమిత్ షా సభ కోసం సోము వీర్రాజు బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై ఆయన విమర్శలు గుప్పించారు. వీళ్లిద్దరూ నియంతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
somu veeraj
buchaiah chowdary

More Telugu News