Chandrababu: 2019లో చంద్రబాబు ఎవరికి మద్దతిస్తే.. వారే ప్రధాని: డొక్కా

  • న్యాయం చేయాలని అడిగినందుకు చంద్రబాబుపై ఎదురుదాడి చేస్తున్నారు
  • అమిత్ షా లేఖలో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు
  • చంద్రబాబు మద్దతు ఇచ్చినవారే ప్రధాని అవుతారు
ఏపీకి న్యాయం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం ఎదురుదాడి ప్రారంభించిందని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. ఇందులో భాగంగానే చంద్రబాబుకు అమిత్ లేఖ రాశారని చెప్పారు. బాహుబలి సినిమాలో కాలకేయుడు రాసినంత నీచంగా అమిత్ షా లేఖ ఉందని విమర్శించారు. అమిత్ షా లేఖలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. 5 కోట్ల మంది ప్రజల కోసం ఏపీలో పోరాటం జరుగుతోందని చెప్పారు. మోదీకి సలాం కొడుతూ వైసీపీ నేతలు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని అన్నారు. 2019లో చంద్రబాబు ఎవరికి మద్దతిస్తే వారే ప్రధాని అవుతారని చెప్పారు.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చాలా తక్కువని... కానీ, చెప్పుకునేది మాత్రం చాలా ఎక్కువని మాణిక్య వరప్రసాద్ అన్నారు. ప్రధాని మోదీ అరాచకాలను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం ఆనవాయతీగా మారిందని విమర్శించారు. 
Chandrababu
amit shah
Narendra Modi
YSRCP
dokka manikya prasad
Special Category Status

More Telugu News