manchu lakshmi: నటీమణులపై నీచంగా మాట్లాడతారా? వదిలే ప్రసక్తే లేదు: మంచు లక్ష్మి

  • పబ్లిసిటీ కోసం సినీ పరిశ్రమలోని మహిళలపై నీచంగా మాట్లాడతారా?
  • ఇంతకంటే నీచం మరొకటి ఉండదు
  • దీన్ని ఇంతటితో వదిలిపెట్టను
సినీ పరిశ్రమ గురించి, అందులో పని చేసే వారి గురించి అసభ్యకరంగా మాట్లాడారంటూ ఓ టీవీ ఛానల్ ఎడిటర్ పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడు శివాజీ రాజాతో పాటు పలువురు నటీనటులు సదరు ఎడిటర్ పై కేసు ఫైల్ చేయించారు.

తాజాగా ఈ వివాదంపై మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'విషయం ఏదైనప్పటికీ మహిళలను ఇలా లేబులింగ్ చేస్తూ ఏ ఒక్కరు కూడా అలాంటి మాటలు మాట్లాడరాదు. నటీమణులను ఉద్దేశిస్తూ అలా మాట్లాడటాన్ని ఏ ఒక్కరూ సహించరు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దీన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు. పబ్లిసిటీ కోసం సినీ పరిశ్రమలోని మహిళలను ఉద్దేశించి అమర్యాదకరంగా మాట్లాడటం కన్నా నీచమైనది మరొకటి ఉండదు' అంటూ ఆమె ట్వీట్ చేశారు.
manchu lakshmi
tollywood
actress
comments

More Telugu News