nimmakayala raja narayana: వైసీపీలో చేరనున్న గుంటూరు జిల్లా టీడీపీ నేత!

  • 27న సత్తెనపల్లిలో జగన్ పాదయాత్ర
  • జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న నిమ్మకాయల రాజనారాయణ
  • 2009లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన నిమ్మకాయల
గుంటూరు జిల్లా టీడీపీ నేత నిమ్మకాయల రాజనారాయణ వైసీపీలో చేరనున్నారు. 2009 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఈ నెల 27వ తేదీన సత్తెనపల్లిలో జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా, జగన్ సమక్షంలో నిమ్మకాయల వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వైసీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు గుబ్బా చంద్రశేఖర్ తో నిన్న నిమ్మకాయల చర్చలు జరిపారు. జగన్ సమక్షంలో తాను వైసీపీలో చేరుతున్నట్టు మీడియాతో రాజనారాయణ తెలిపారు. గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.
nimmakayala raja narayana
Telugudesam
YSRCP
Jagan

More Telugu News