suicide: ప్రియుడి మరణవార్త విని ప్రియురాలి ఆత్మహత్య

  • నిర్మల్ జిల్లాలో విషాద ఘటన
  • ప్రేమ విఫలం కావడమే కారణం
  • భైంసా మండలం వట్టొలికి చెందిన యువకుడి ఆత్మహత్య
  • సారంగాపూర్ మండలం జౌళి గ్రామంలో ప్రియురాలి ఆత్మహత్య
నిర్మల్ జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. భైంసా మండలం వట్టొలికి చెందిన 27 ఏళ్ల మురళి... సారంగాపూర్ మండలం జౌళి గ్రామానికి చెందిన సంగీత (21) అనే యువతితో కొంత కాలంగా ప్రేమాయణం కొనసాగించాడు. అయితే, వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు తీవ్ర మనస్తాపం చెందారు. ఈ క్రమంలో ఈ రోజు వట్టొలిలోని తమ ఇంట్లో మురళి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో జౌళి గ్రామంలోని తమ ఇంట్లో ఉన్న సంగీత ఈ విషయాన్ని తెలుసుకుని.. ఆమె కూడా తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  
suicide
Nirmal District

More Telugu News