vishnu kumar raju: రాజధాని వ్యవహారంలో టీడీపీ వైఖరి తప్పు!: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజధాని వ్యవహారంలో టీడీపీ వైఖరిని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తప్పుబట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి కేంద్ర ప్రభుత్వం మట్టి, నీరు ఇచ్చిందని విమర్శలు చేస్తున్నారని, మీరు మాత్రం హెలికాప్టర్ లో తిరిగి నీళ్లు చల్లి శుద్ధి చేస్తారా? అని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

నాలుగేళ్లవుతున్నా, రాజధాని డిజైన్లు ఇప్పటివరకు ఖరారు చేయలేదని విమర్శించారు. రాజధానిలో 1000 బిల్డింగ్ లు కట్టడానికి కేవలం రూ.2000 కోట్లు ఖర్చు అవుతుందని, ఏపీ సర్కార్ మాత్రం రూ.40 వేల కోట్లు ఖర్చవుతుందంటూ తప్పుడు లెక్కలు చెబుతోందని, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఒక ఎస్ఎఫ్ టీ కి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ తాత్కాలిక అసెంబ్లీలో టాయిలెట్లు లేవని, వెంటిలేషన్ కూడా సరిగా లేదని విష్ణుకుమార్ రాజు విమర్శించారు.
Go Back to Shorts
vishnu kumar raju
BJP

More Telugu News