Chandrababu: కాపులను చంద్రబాబు నిలువునా ముంచారు: మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు

షార్ట్స్‌లో చూడండి
కాపులను చంద్రబాబు నిలువునా ముంచారని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపి, చేతులు దులుపుకుంటే సరిపోదని, కాపు రిజర్వేషన్ల అంశం వాస్తవ పరిస్థితి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాపు కార్పొరేషన్ కు ఎన్ని నిధులిచ్చారు? ఎంత ఖర్చు చేశారు? పోలవరాన్ని చంద్రబాబు అవినీతిమయం చేశారు. మట్టిని తవ్వకుండానే రూ.150 కోట్లు నొక్కేశారు.. అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడ దుర్గమ్మ ఫ్లైఓవర్ వంతెన కట్టలేని చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
kurasal kanna babu

More Telugu News