mohreen kour pirzada: మెహ్రీన్ కౌర్ రెమ్యూనరేషన్ డిమాండ్ కి బిత్తరపోయిన నిర్మాత!

  • నాగశౌర్య హీరోగా నర్తనశాల సినిమా
  • నర్తనశాల సినిమాలో హీరోయిన్ కోసం మెహ్రీన్ ను సంప్రదించిన చిత్రయూనిట్
  • మెహ్రీన్ డిమాండ్ తో ఆలోచనలో పడ్డ నిర్మాతలు
వరుస విజయాలతో క్రేజీ హీరోయిన్ గా మారిన మెహ్రీన్ కౌర్ గురించిన వార్త ఒకటి ఫిల్మ్ నగర్ సర్కిల్ లో హల్ చల్ చేస్తోంది. నాగశౌర్య హీరోగా నర్తనశాల సినిమాను ప్లాన్ చేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మెహ్రీన్ కౌర్‌ ను చిత్ర బృందం సంప్రదించగా, ఈ ముద్దుగమ్మ నిర్మాతల ముందు వివిధ డిమాండ్లు ఉంచినట్టు తెలుస్తోంది.

రెమ్యునరేషన్ గా 90 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన మెహ్రీన్, చేతి ఖర్చుల కోసం రోజూ 20,000 ఇవ్వాలని షరతులు పెట్టిందట. దీంతో ఆమెను ఈ సినిమాలో తీసుకోవాలా? లేక ఇంకో సినీనటిని సంప్రదించాలా? అన్న విషయంలో నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ 12న సెట్స్‌ పైకి రానున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది చిత్రయూనిట్ ప్రకటించాల్సి ఉంది.
mohreen kour pirzada
mohreen
nartanasala
nagashourya

More Telugu News