nagachaitanya: చైతూ కోసం వెయిటింగ్ ఇక్కడ: దర్శకుడు మారుతి

షార్ట్స్‌లో చూడండి
నాగచైతన్య హీరోగా మారుతి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. యూత్ .. మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన సిద్ధం చేసిన కథకి 'శైలజా రెడ్డి అల్లుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా ఎక్కడి వరకూ వచ్చిందనే విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తితో వున్నారు.

 ఈ నేపథ్యంలో మారుతి స్పందిస్తూ .. "అందరూ చైతూ మూవీ గురించి అడుగుతున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది.. రెండవ షెడ్యూల్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. 'సవ్యసాచి' సినిమా పనుల్లో చైతూ బిజీగా ఉండటమే ఈ ఆలస్యానికి కారణం. నేను మీలాగే ఆయన కోసం వెయిటింగులో వున్నాను. ఈ సినిమా ఫస్టులుక్ ను మే నెలలో రిలీజ్ చేసే అవకాశాలు వున్నాయి. అప్పటివరకూ వెయిట్ చేయండి బ్రదర్స్ " అంటూ ట్వీట్ చేశాడు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.       
Go Back to Shorts
nagachaitanya
maruthi

More Telugu News