shami: షమీపై చర్యలు తీసుకునేందుకు సహకరించండి: దీదీకి హసీన్ వినతి

  • మమతా బెనర్జీని కలిసిన షమీ భార్య 
  • తను చేసిన ఆరోపణలకు గల సాక్ష్యాలను అందజేసిన హసీన్ జహాన్
  • తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరిన హసీన్ జహాన్
టీమిండియా పేసర్ మహమ్మద్‌ షమీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆయన భార్య హసీన్ జహాన్ కలిశారు. ఈ సందర్భంగా తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని సీఎంకు తెలిపారు. తనను షమీ, అతని కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. మ్యాచ్ ఫిక్సింగ్ కు ముడుపులు కూడా తీసుకున్నాడని ఆమె సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఆరోపణలకు సంబంధించిన వివరాలను దీదీకి అందజేశారు. తనకు మద్దతుగా నిలవాలని ఆమెను హసీన్ అభ్యర్థించారు. షమీపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, షమీపై ఆమె గృహహింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. 
shami
haseen jahan
mamata benarjee
West Bengal

More Telugu News