aob: ఏపీకి హోదా కోసం ప్రజలందరూ ముందుకు రావాలి: ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ

  • నాలుగేళ్లుగా టీడీపీ-బీజేపీలు ప్రజలను మోసం చేశాయి
  • ఎన్నికలు సమీపిస్తుండటంతో హోదా నినాదాన్ని ఎత్తుకున్నారు
  • ఏపీకి కావాల్సింది పెట్టుబడిదారుల హోదా కాదు ప్రజల హోదా
  • ఓ లేఖ రాసిన ఏవోబీ జోన్ కమిటీ కార్యదర్శి
ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు ప్రజలందరూ ముందుకు రావాలని ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు (ఏవోబీ) జోన్ కమిటీ కార్యదర్శి చంద్రమౌళి కోరారు. ఈ మేరకు రాసిన ఓ లేఖను మీడియాకు విడుదల చేశారు. నాలుగేళ్లుగా టీడీపీ-బీజేపీలు ప్రజలను మోసం చేశాయని, ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ‘ప్రత్యేక హోదా’ నినాదం ద్వారా రంగంలోకి దిగారని, ‘హోదా’ కోసం మరో బూర్జువా పార్టీ సభ్యులు రాజీనామా చేస్తామంటున్నారని విమర్శించారు. ఏపీకి కావాల్సింది పెట్టుబడిదారుల హోదా కాదని, ప్రజల హోదా అని అభిప్రాయపడ్డారు. 
aob
zone committee

More Telugu News