Andhra Pradesh: ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్ ఏకగ్రీవం

  • సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ కు కృతఙ్ఞతలు
  • టీడీపీ ప్రభుత్వానిది అవినీతి లేని పాలన
  • ‘అవిశ్వాసం’ విషయంలో ‘కేంద్రం’ పారిపోయింది : సీఎం రమేష్
రెండోసారి తనను రాజ్యసభకు పంపినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ కు తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని సీఎం రమేష్ అన్నారు. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం, సీఎం రమేశ్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం అవినీతి లేకుండా పరిపాలన చేస్తోందని అన్నారు.

ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానం అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీ అడ్డుకుంటోందని, ‘అవిశ్వాసం’ విషయంలో ప్రభుత్వం పారిపోయిందని, కేంద్రం దిగొచ్చి ఏపీకి న్యాయం చేసే వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు. 
Andhra Pradesh
CM Ramesh

More Telugu News