Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నిలబెట్టిన ముగ్గురు అభ్యర్థుల గెలుపు

  • టీఆర్‌ఎస్ అభ్యర్థి బండ ప్రకాశ్‌కు 33 ఓట్లు
  • బడుగుల లింగయ్య యాదవ్‌కు 32 ఓట్లు
  • జోగినపల్లి సంతోష్ కుమార్‌కు 32 ఓట్లు
ఈ రోజు జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాల్లో నిలబెట్టిన అభ్యర్థులు గెలుపొందారు. ఆ పార్టీకి చెందిన బండ ప్రకాశ్‌కు 33 ఓట్లు, బడుగుల లింగయ్య యాదవ్‌కు 32 ఓట్లు, జోగినపల్లి సంతోష్ కుమార్‌కు 32 ఓట్లు పడ్డాయి.

కాగా, కాంగ్రెస్ నుంచి పోటీకి దిగిన ఏకైక అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పి.బలరాంనాయక్ ఓడిపోయారు. రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం 117 మంది ఓటర్లుండగా వారిలో 108 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఆయనతో పాటు ఇతర పార్టీలకు చెందిన మరికొందరు కూడా ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు.
Rajya Sabha
TRS
Congress

More Telugu News