Chandrababu: చంద్రబాబును కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు
- సచివాలయ భవంతులు, అసెంబ్లీ ఆకృతులపై ఎమ్మెల్యేల సంతృప్తి
- డిసెంబర్ నాటికి ఎమ్మెల్యే క్వార్టర్స్ సిద్ధం
- సందర్శకుల కోసం ప్రతి క్వార్టర్ లోనూ ప్రత్యేక హాల్
- కొత్త అసెంబ్లీ భవనంలోకి అడుగుపెట్టాలన్న సంకల్పంతో కష్టపడి పనిచేయాలి : ఎమ్మెల్యేలతో చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబును మంత్రులు, ఎమ్మెల్యేలు కలిశారు. సచివాలయ భవంతులు, అసెంబ్లీ ఆకృతులు, ఎమ్మెల్యే క్వార్టర్స్ పై ఎమ్మెల్యేలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారితో చంద్రబాబు మాట్లాడుతూ, డిసెంబర్ నాటికి ఎమ్మెల్యే క్వార్టర్లు సిద్ధమవుతాయని, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ ఫూల్, జిమ్ సహా సకల సౌకర్యాలతో ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణం జరుగుతుందని, సందర్శకుల కోసం ప్రతి క్వార్టర్ లోనూ ప్రత్యేక హాల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
నూతనంగా నిర్మించే అసెంబ్లీ భవనంలోకి అడుగుపెట్టాలన్న సంకల్పంతో కష్టపడి పనిచేయాలని, వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తేనే ఇది సాకారమవుతుందని ఎమ్మెల్యేలతో చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు. ఇసుజు, కియా, హీరో వంటి ఎన్నో దిగ్గజ కంపెనీలు ఏపీకి వచ్చాయని, ఇంకా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు.