Andhra Pradesh: ఏపీకి రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారు: యనమల
ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన నిధుల్లో కేంద్ర మంత్రులు కోతలు విధిస్తున్నారని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పోలవరం ప్రాజెక్టుకి రూ.1400 కోట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం... అందులో రూ.300 కోట్ల కోత విధించిందని తెలిపారు.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని అన్నారు. ఏ1, ఏ2లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సభాహక్కుల నోటీసు ఇస్తామనడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ పక్క అవిశ్వాస తీర్మానం పెడుతూ మరోపక్క విజయసాయిరెడ్డి పీఎంవోలో ఉండడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఏపీలో మహా కుట్ర పన్నుతున్నాయని, ఆ విషయం ప్రజలకు అర్థమవుతోందని అన్నారు.