BJP: ‘ఆపరేషన్ గరుడ’ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో బయటపెట్టాలి : సోము వీర్రాజు డిమాండ్

  • ‘ఆపరేషన్ గరుడ’ ఆధారాలతో కేసు ఎందుకు పెట్టలేదు?
  • ఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది
  • ‘ఓటుకు నోటు’, ‘మిషన్ గరుడ’ని విచారించి వాస్తవాలు బయటపెట్టాలి  
‘ఆపరేషన్ గరుడ’ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో బయటపెట్టాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఆపరేషన్ గరుడ’కు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెబుతున్న వ్యక్తి, వాటి ఆధారంగా ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు, మిషన్ గరుడని విచారించి వాస్తవాలు బయటపెట్టాలని ఈ సందర్భంగా సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని, టెండర్లు లేకుండా పనులు చేయడం వల్ల పట్టిసీమ నిర్మాణ వ్యయం పెరిగిందని అన్నారు.
BJP
somu veeraj

More Telugu News