guntur: గుంటూరులో టీడీపీ వినూత్న నిరసన!

  • ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై టీడీపీ శ్రేణుల మండిపాటు
  • క్రేన్ కు తలకిందులుగా వేలాడుతూ టీడీపీ నేత నిరసన
  • చేతిలో శంఖం పూరించిన వైనం
ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విభజన  చట్టంలోని హామీలను అమలు చేయాలని నేతలు నినదించారు. ఈ నిరసనలో భాగంగా గుంటూరు జిల్లా టీడీపీ నేతలు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక లక్ష్మీపురం సెంటర్ లో టీడీపీ నేత మోహన్.. క్రేన్ కు తల్ల కిందులుగా వేలాడుతూ, తన చేతిలో ఉన్న శంఖాన్ని ఊదుతూ నిరసన వ్యక్తం చేశారు. ‘ఏపీకి మోదీ ద్రోహం చేశారు’, ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’, ‘జోహార్ అన్న ఎన్టీఆర్’ అనే నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. 
guntur
Telugudesam

More Telugu News