Mahesh Babu: హీరోగా మహేశ్ బాబు మేనల్లుడి ఎంట్రీకి రంగం సిద్ధం

  • హీరోగా గల్లా అశోక్ ఎంట్రీ
  • నిర్మాతగా దిల్ రాజు 
  • మేలో లాంచ్ చేసే ఛాన్స్  
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు అగ్రకథానాయకుడిగా కొనసాగుతున్నాడు. వివిధ భాషల్లో సైతం ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతూ ఉండటం విశేషం. ఇక మహేశ్ బాబు బావ అయిన సుధీర్ బాబు కూడా హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 ఈ క్రమంలో ఒక వైపున మహేశ్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకైన జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో మహేశ్ బాబు మేనల్లుడు (గల్లా జయదేవ్ తనయుడు) గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైపోయింది. గతంలో సుధీర్ బాబు హీరోగా 'ఆడు మగాడ్రా బుజ్జి' సినిమా చేసిన కృష్ణారెడ్డి, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాను, మే లో లాంచ్ చేసే ఆలోచనలో వున్నారు.   
Mahesh Babu
galla ashok

More Telugu News