rakul preet singh: 6 అడుగుల అబ్బాయిలకు అవకాశం... రకుల్ కి అలాంటోడే కావాలట!

  • నా ఎత్తు 5.9 అడుగులు
  • నాక్కాబోయేవాడు నాకంటే పొడగరి అయి ఉండాలి
  • పాకెట్ మనీ కోసమే కెమెరా ముందుకొచ్చాను
తనను పెళ్లాడబోయేవాడు తనకంటే పొడగరి అయి ఉండాలని ప్రముఖ సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. టాలీవుడ్ లో అగ్రనాయకిగా ఉన్న రకుల్, కోలీవుడ్ లో పాగావేసే ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వూలో రకుల్ మాట్లాడుతూ, తన ఎత్తు 5.9 అడుగులని, తనకు కాబోయేవాడు అంతకు మించిన ఎత్తుకలవాడై ఉండాలని చెప్పింది. తాను నటిని కావాలనుకోలేదని చెప్పింది. పాకెట్‌ మనీ కోసమే నటించేందుకు కెమెరా ముందుకొచ్చానని చెప్పింది.

ఆ తరువాతే నటనను కొనసాగించానని తెలిపింది. నిబద్ధతతో జీవిస్తే ప్రణాళికలతో అవసరం లేదని అభిప్రాయపడింది. ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండడం వల్ల తనలో పరిణతి పెరిగిందని, దీంతోనే తాను మంచి కథా చిత్రాలను ఎంపిక చేసుకోగలిగానని తెలిపింది. పదేళ్ల తరువాత వెనుదిరిగి చూసుకుంటే చేసిన ప్రతి సినిమా గుర్తుండిపోవాలని పేర్కొంది. సినిమాలు శాశ్వతం కాదన్న ఆలోచనతోనే విదేశీ నిపుణులతో కలిసి హైదరాబాద్‌ లో జిమ్‌ వ్యాపారం ప్రారంభించానని తెలిపింది. 
rakul preet singh
Tollywood
actress

More Telugu News