vishnu kumar raju: పట్టిసీమ పూర్తయి రెండేళ్లవుతోంది.. విష్ణుకుమార్‌ రాజు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: ధూళిపాళ్ల నరేంద్ర

  • డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుందనే గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా తీసుకువచ్చాం
  • డెల్టా ప్రాంతానికి ఇప్పటివరకు 115 టీఎంసీల నీరు అందించాం
  • ఆ ప్రాజెక్టు వల్ల డెల్టాలో రైతులు పంటలు పండించుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తోన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పట్టి సీమ పూర్తైన రెండేళ్ల తరువాత ఆ ప్రాజెక్టుపై విష్ణుకుమార్ రాజు ఆరోపణలు చేస్తున్నారని, ఈ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుందన్న ఆందోళనతోనే గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా తీసుకువచ్చారని అన్నారు.

పట్టిసీమ నుంచి డెల్టా ప్రాంతానికి ఇప్పటివరకు 115 టీఎంసీల నీరు అందించామని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల డెల్టాలో రైతులు పంటలు పండిస్తోంటే ఈ సమయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారని, ఇది ఎంతవరకు సబబని అడిగారు.
vishnu kumar raju
dhoolipalla
Chandrababu
Telugudesam

More Telugu News