BJP: పునరావాసంపై పవన్ కల్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతోంటే బీజేపీ ఎందుకు తప్పుపట్టలేదు?: చంద్రబాబు

  • నిన్నటివరకు బీజేపీ నేతలు బాగానే ఉన్నారు
  • ఇప్పుడు టీడీపీని విమర్శిస్తున్నారు
  • మాకు హై కమాండ్ ఢిల్లీలో లేదు
  • ఐదు కోట్ల మంది ప్రజలే మా హై కమాండ్
పోలవరం పునరావాస బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ రోజు శాసనమండలిలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యపై స్పందించిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... మరి పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పవన్ కల్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతోంటే బీజేపీ ఎందుకు తప్పుపట్టలేదని ప్రశ్నించారు.

కాగా, నిన్నటివరకు (ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేవరకు) బాగానే ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా టీడీపీని విమర్శిస్తున్నారని అన్నారు. తమకు హై కమాండ్ ఢిల్లీలో లేదని, ఐదు కోట్ల మంది ప్రజలే తమ హై కమాండ్ అని చంద్రబాబు అన్నారు. తాము రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడతామని, ఎవ్వరికీ భయపడబోమని తెలిపారు. ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
BJP
Andhra Pradesh
Chandrababu
Pawan Kalyan

More Telugu News