ఆ కుట్ర పేరు ఆపరేషన్ ద్రవిడ.. ఓ జాతీయ పార్టీ మొత్తం రూ.4,800 కోట్లు ఖర్చు చేస్తోంది: హీరో శివాజీ సంచలన ఆరోపణలు
- ఆ జాతీయ పార్టీ చేపట్టిన ఆపరేషన్ పేరు 'గరుడ' కాదు
- తమిళనాడు, కేరళలో ఆపరేషన్ రావణ
- కర్ణాటకకు సంబంధించిన ఆపరేషన్ పేరు 'కుమార'
- అన్ని విషయాలను పొందుపర్చిన ఓ పెన్‌డ్రైవ్‌ను అందరికీ ఇస్తా
ఇందుకు సంబంధించిన విషయాలన్నింటినీ ఓ పెన్‌డ్రైవ్‌లో పొందుపర్చానని త్వరలోనే అందరికీ ఇస్తానని శివాజీ చెప్పారు. అందులో పూర్తి వివరణ ఇస్తానని తెలిపారు. ఓ కొత్త నాయకుడిని ఆ జాతీయ పార్టీ పావులా వాడుకుంటోందని తెలిపారు. ఏపీ మీద ఆధిపత్యం చెలాయించడానికి ఎటువంటి చర్యలు చేపట్టారో తాను తెలుపుతానని అన్నారు. మొత్తం 4,800 కోట్ల రూపాయలు ఓ జాతీయ పార్టీ ఈ ఆపరేషన్ల కోసం కేటాయించిందని అన్నారు.
ఏపీలో ఉన్న ప్రస్తుత రాజకీయ అవకాశాలను వాడుకునేందుకు జాతీయ పార్టీ కుట్ర పన్నిందని సంచలన ఆరోపణలు చేశారు. ఓ పెన్‌డ్రైవ్ ఇస్తానని, అందులో అన్ని విషయాలు తెలుసుకుని తనను మిగతా విషయాలపై ప్రశ్నించాలని అన్నారు. కాగా, ఆ 'జాతీయ పార్టీ' పేరును శివాజీ నేరుగా చెప్పలేదు.