Chandrababu: కేసులకు భయపడే ప్రసక్తే లేదు: చంద్రబాబు

  • పట్టిసీమపై ఆరోపణలు గుప్పిస్తున్నారు
  • పోలవరంను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు
  • పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారు
రాజకీయాలు వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టుపై అనవసర ఆరోపణలు గుప్పిస్తున్నారని అన్నారు. నాలుగేళ్ల తర్వాత బీజేపీ నేతలకు అక్రమాలు, అవినీతి కనిపించాయా? అని ప్రశ్నించారు.

2019 నాటికి పోలవరం నుంచి నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు నత్తనడకన సాగుతాయని... అందుకే పోలవరం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిందని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పారు. కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సినవాటి గురించి చర్చించేందుకు అవిశ్వాస తీర్మానం పెడితే... దానిపై చర్చించేందుకు కూడా బీజేపీ ముందుకు రావడం లేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పోలవరంను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. పోలవరంను వదులుకునేందుకు ఒక్క రైతు కూడా సిద్ధంగా లేడని తెలిపారు.
Chandrababu
Pawan Kalyan
BJP
polavaram
pattiseema

More Telugu News