chiranjeevi: 'సైరా' సంగీత దర్శకుడిగా ఆయనకే ఛాన్స్?

  • ప్రత్యేకమైన సెట్లో 'సైరా' షూటింగ్
  • కీలక సన్నివేశాల చిత్రీకరణ  
  • సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేది పేరు 
'సైరా' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన భారీ సెట్ లో జరుగుతోంది. చిరంజీవి .. నయనతార .. జగపతిబాబు కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముందుగా ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. అయితే ప్రస్తుతం తనకి గల కమిట్మెంట్స్ కారణంగా చేయలేనని ఆయన చెప్పడంతో, తమన్ కి ఛాన్స్ వెళుతుందని అనుకున్నారు.

ఇక ఈ మధ్య కీరవాణి పేరు ఎక్కువగా వినిపించింది. 'బాహుబలి' వంటి భారీ చిత్రానికి పనిచేసిన అనుభవం కారణంగా, ఆయననే తీసుకోవచ్చని అనుకున్నారు. కానీ అలా జరగకుండా .. బాలీవుడ్ సంగీత దర్శకుడు 'అమిత్ త్రివేది' పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన గత చిత్రాలను పరిశీలించిన 'సైరా' టీమ్, ఆయనైతే తాము అనుకున్న అవుట్ పుట్ వస్తుందని భావిస్తున్నారట. దాదాపు ఆయనే ఖాయం కావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.    
chiranjeevi
nayanatara

More Telugu News