Ame Jakson: అభిమానులకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్న '2.0' హీరోయిన్ ఎమీ జాక్సన్

  • శంకర్ దర్శకత్వంలో రెండు సార్లు చాన్స్
  • రజనీతో '2.0' తరువాత అవకాశాలు రాక నిరాశ
  • ఇండియన్ మూవీస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఎమీ!
దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రెండు సార్లు చాన్స్ కొట్టేసిన అతి కొద్దిమంది హీరోయిన్లలో ఒకరైన కెనడా ముద్దుగుమ్మ ఎమీ జాక్సన్, అభిమానులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే, శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన గతంలో నటించి, ఆపై తాజాగా రజనీకాంత్ తో జతకట్టి '2.0'లోనూ యాక్ట్ చేసిన ఎమీ, ఈ చిత్రం విడుదలైతే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావించిందట.

అయితే, సినిమా విడుదల దీర్ఘకాలంగా వాయిదాలు పడుతూ ఉండటం, కొత్త అవకాశాలు తన తలుపు తట్టకపోవడంతో నిరాశ చెందిన ఎమీ జాక్సన్, ఇండియన్ మూవీస్ కు గుడ్ బై చెప్పి, ఆఫ్రికా దేశంలోని మొరాకో నగరంలో సెటిల్ కావాలని భావిస్తోందన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో స్వయంగా ఎమీ నోరువిప్పితేగాని నిజం తెలియదు.
Ame Jakson
Shankar
2.0
Rajanikant

More Telugu News