parliament: ఇంత ద్రోహం చేస్తారనుకోలేదు: టీడీపీ ఎంపీలు

  • సభను టీఆర్ఎస్, అన్నాడీఎంకే అడ్డుకుంటున్నాయి
  • ఆ పార్టీలతో మోదీ మాట్లాడవచ్చు కదా
  • మోదీ ఇంత ద్రోహం చేస్తారనుకోలేదు
కావాలనే టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీల ఎంపీలు లోక్ సభను అడ్డుకుంటున్నారని టీడీపీ ఎంపీలు విమర్శించారు. సభలో అవిశ్వాసంపై చర్చ జరిగితే... వారి సమస్యలను కూడా లేవనెత్తవచ్చు కదా? అని అన్నారు. రోజుల తరబడి ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నా ప్రధాని మోదీ నుంచి స్పందనే లేదని చెప్పారు. ఆంధ్ర ప్రజలకు మోదీ ఇంత ద్రోహం చేస్తారని తాము భావించలేదని అన్నారు.

గతంలో కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఇప్పుడు బీజేపీ చేస్తోందని చెప్పారు. టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలతో మాట్లాడేందుకు మోదీకి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు ప్రహరీగోడ నిర్మించడానికి మాత్రమే సరిపోతాయని ఎద్దేవా చేశారు. 
parliament
Telugudesam
BJP
TRS
Narendra Modi

More Telugu News