kalyan ram: సారీ బాబాయ్! నువ్వెన్నిసార్లు పిలిచినా రాలేకపోయాను: అల్లరి నరేష్ తో కల్యాణ్ రామ్

షార్ట్స్‌లో చూడండి
సారీ బాబాయ్! నువ్వెన్నిసార్లు పిలిచినా రాలేకపోయాను. ఈ సారి తప్పకుండా వస్తాను అని నందమూరి కల్యాణ్ రామ్ ‘ఎమ్ఎల్ఏ’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లరి నరేష్ ని ఉద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, తాను ఇండస్ట్రీలో బాబాయ్.. బాబాయ్ అని పిలిచే ఏకైక వ్యక్తి నరేష్ అన్నాడు. తాను తన సొంత బాబాయ్ ని తప్ప అలా ఎవరినీ పిలవనని చెప్పాడు. బాబాయ్ తరువాత అలా పిలిచేది నరేష్ నేనని అన్నాడు.

ఫిల్మ్ నగర్ లో తన ఆఫీస్, అల్లరి నరేష్ ఆఫీస్ రెండూ పక్కపక్కనేనని ఉంటాయని చెప్పాడు. పెళ్లయ్యేంతవరకు తాను రోజూ నరేష్ ని కలిసేవాడినని అన్నాడు. పెళ్లి తరువాత తానే అతనిని కలవడం మానేశానని చెప్పాడు. నరేష్ సినిమా ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా ఫస్ట్ కాల్ తనకే వస్తుందని, అయితే తాను ఎప్పుడూ వెళ్లలేకపోయానని అన్నాడు. అయినా సరే దానిని మనసులో పెట్టుకోకుండా ఈ ప్రీరిలీజ్ ఫంక్షన్ కి వచ్చి విష్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు. ఈ సారి నరేష్ సినిమా ఫంక్షన్‌ కు కచ్చితంగా వెళ్తానని చెప్పాడు. 
Go Back to Shorts
kalyan ram
allari naresh
mla pre relese event

More Telugu News