Allu Arjun: తమిళంలోను అదే రోజున రంగంలోకి దిగుతోన్న బన్నీ

  • 'నా పేరు సూర్య' కోసం బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్ 
  • అదే రోజున మలయాళంలోను రిలీజ్ 
  • తమిళంలోను అదే రోజును ఫిక్స్ చేసిన టీమ్
అల్లు అర్జున్ అభిమానులంతా 'నా పేరు సూర్య' కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆర్మీ ఆఫీసర్ గా బన్నీ న్యూలుక్ తో కనిపిస్తూ ఉండటంతో, ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగులోనే కాదు, మలయాళంలోను బన్నీకి అభిమానుల సంఖ్య ఎక్కువే. అందువలన తెలుగుతో పాటు మలయాళంలోను ఒకే రోజున బన్నీ సినిమాలు విడుదలవుతూ ఉంటాయి.

అలా సినిమా .. సినిమాకి అక్కడ ఆయన మార్కెట్ పెరుగుతూ వస్తోంది. ఇంతకుముందు తెలుగు .. మలయాళ భాషల తరువాత కొంత కాలానికి బన్నీ సినిమాలు తమిళంలోకి అనువాదమయ్యేవి. కానీ ఈసారి అలాకాదు .. తెలుగు .. మలయాళ భాషలతో పాటు, తమిళ అనువాదాన్ని కూడా ఒకే రోజున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకి 'ఎన్ పేరు సూర్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. మే 5వ తేదీన ఈ మూడు భాషల్లోని ప్రేక్షకులను ఈ సినిమా పలకరించనుంది.     
Allu Arjun
anu emmanuel

More Telugu News