mahabharat: రూ. 1000 కోట్ల అమీర్ ఖాన్ 'మహాభారత్'కు సహనిర్మాతగా దేశ అత్యంత సంపన్నుడు!

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న 'మహాభారత్' సినిమా సిరీస్ కు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సిరీస్ కు దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నారట. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ విషయం తెలిసినట్టు మిడ్-డే పత్రిక తెలిపింది.

ఇప్పటికే ఈరోస్, ఏక్తా కపూర్ కు చెందిన బాలాజీ టెలీ ఫిలింస్ లలో ముఖేష్ పెట్టుబడులు పెట్టారు. అయితే కొత్త సంస్థను స్థాపించడం ద్వారా 'మహాభారత్'కు ముఖేష్ పెట్టుబడులు పెడతారా? లేక ఇప్పటికే ఆయనకు ఉన్న మీడియా సంబంధిత సంస్థలు జియో, వయాకామ్ 18 ల ద్వారా పెట్టుబడులు పెడతారా? అనే విషయంలో క్లారిటీ లేదు. మూడు నుంచి ఐదు భాగాలుగా ఈ సినిమా నిర్మితమవుతుందని తెలుస్తోంది. ఎక్కువ మంది దర్శకులు ఈ సినిమాకు పని చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రపంచ ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ రచయితలను రప్పిస్తున్నట్టు తెలుస్తోంది. 
Go Back to Shorts
mahabharat
Aamir Khan
mukhesh ambani
producer

More Telugu News