Kesineni Nani: చిరంజీవిది పోస్ట్ పెయిడ్.. పవన్ ది ప్రీ పెయిడ్: కేశినేని నాని

  • ప్రత్యేక హోదాపై చిరంజీవి స్పందించడం లేదు
  • దీనిపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?
  • బీజేపీకి జనాలు బుద్ధి చెబుతారు
మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో సొంత అన్న చిరంజీవిని ప్రశ్నించలేని పవన్ కల్యాణ్... ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడుతుంటే, చిరంజీవి మాత్రం ఇంతవరకు స్పందించలేదని... దీనిపై పవన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

చిరంజీవి ప్రజారాజ్యం పోస్ట్ పెయిడ్ పార్టీ అయితే... పవన్ జనసేన ప్రీ పెయిడ్ పార్టీ అని ఎద్దేవా చేశారు. బీజేపీకి పోయేకాలం దాపురించిందని అన్నారు. ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని... కానీ ఆ పార్టీకి జనాలు బుద్ధి చెబుతారని తెలిపారు. అవిశ్వాసంపై చర్చకు అనుమతించే ఆలోచన కేంద్రానికి లేదని... సభను ఆర్డర్ లో పెట్టాల్సిన బాధ్యత స్పీకర్ దేనని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.


Kesineni Nani
Pawan Kalyan
Chiranjeevi
Chandrababu
no confidence motion

More Telugu News