komatireddy: నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • నన్ను చంపాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది
  • అందుకే గన్ మెన్లను తొలగించారు
  • నేను పిరికిపందను కాను

మాజీ మంత్రి, శాసనసభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. తమకు గన్ మెన్లను తొలగించడం ఈ కుట్రలో భాగమేనని అన్నారు. తనకు ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పేంత పిరికిపందను కానని చెప్పారు.

'కేసీఆర్! నీ బుల్లెట్ కంటే నా గుండె చాలా గట్టిది' అని ఆయన అన్నారు. ఈ ఉదయం సంపత్ తో కలసి ఆయన ఢిల్లీ వెళ్లారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు వీరిద్దరూ ఎన్నికల కమిషన్ ను కలవనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాలని ఈసీని కోరనున్నారు.

More Telugu News