Parliament: సభ సజావుగా సాగితే...మధ్యాహ్నం 12 గంటలకు అవిశ్వాసంపై చర్చించే ఛాన్స్..!

  • అవిశ్వాసంపై చర్చకు టీడీపీ, వైకాపాల పట్టు
  • వివిధ అంశాలపై ఆందోళన కొనసాగిస్తామన్న అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్
  • పార్లమెంటులో సద్దుమణగని గందరగోళం
కేంద్రంలోని ఎన్‌డీయే సర్కార్‌పై టీడీపీ, వైకాపాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చర్చను చేబట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే సభ సజావుగా ముందుకు సాగితేనే చర్చకు అవకాశముంటుందని, లేదంటే మరోసారి వాయిదా పడొచ్చని సమాచారం. అవిశ్వాసంపై చర్చ జరపాలంటూ టీడీపీ, వైకాపాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.

మరోవైపు అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌లు మాత్రం వివిధ అంశాలపై తమ ఆందోళన వ్యక్తం చేసి తీరుతామని స్పష్టం చేస్తున్నాయి. దీంతో సభలో నెలకొంటున్న గందరగోళ పరిస్థితులు ఏ మాత్రం సద్దుమణగడం లేదు. ఇదిలా ఉంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపీలతో ఈ రోజు ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు పోరాడాలని సూచించారు.
Parliament
Lokhsabha
Chandrababu
MPs
Non-Confidence motion

More Telugu News