బీజేపీ ఎంపీ సంచలన ప్రతిపాదన.. ఘాటుగా బదులిచ్చిన టీఆర్ఎస్ ఎంపీ కవిత!
- సభలో అనవసర ఆందోళనకు దిగుతున్నారన్న బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ
- ‘నో వర్క్-నో పే’ను ప్రతిపాదిస్తూ స్పీకర్‌కు లేఖ
- కావాలని ఎవరూ ఆందోళనకు దిగరన్న కవిత
తివారీ లేఖపై టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఎవరూ కావాలని పార్లమెంటులో ఆందోళనకు దిగరన్న విషయాన్ని తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. తివారీ తీరు చూస్తుంటే ‘దొంగే దొంగ’ అని అరుస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఏ పార్టీ కానీ, ఎంపీ కానీ కావాలని, సమావేశాలను అడ్డుకోవాలని చూడరని కవిత పేర్కొన్నారు. ఈ విషయంలో మారాల్సింది ప్రభుత్వం తీరేనని స్పష్టం చేశారు.