ambati rambabu: చంద్రబాబు మైండ్ అప్పుడే ఎన్నికల గురించి ఆలోచిస్తోంది: అంబటి రాంబాబు

  • పరిణామాలు చకచకా మారిపోతున్నాయి
  • చంద్రబాబుకు డిపాజిట్ కూడా రాదు
  • ఇన్నిసార్లు మాట మార్చిన వ్యక్తి చంద్రబాబు ఒక్కరే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అనవసరమని తొలుత చెప్పిన చంద్రబాబు... ఆ తర్వాత ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని చెప్పారని... ఆ తర్వాత తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమని, టీడీపీనే అవిశ్వాసం పెడుతుందని అన్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలపై కూడా చంద్రబాబు మాటలు మార్చారని అన్నారు.

 ఇన్నిసార్లు మాటలు మార్చిన వ్యక్తి దేశంలో చంద్రబాబు ఒక్కరే ఉంటారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా రాకుండా చంద్రబాబు నాలుగేళ్లు అడ్డుకున్నారని విమర్శించారు. చంద్రబాబు మైండ్ అప్పుడే ఎన్నికల గురించి ఆలోచిస్తోందని... పరిణామాలు చకచకా మారిపోతుండటమే దానికి కారణమని అన్నారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావాలని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. 
ambati rambabu
Chandrababu
Special Category Status
no confidence motion
elections

More Telugu News