kcr: మమతా బెనర్జీని కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • తన విలాసవంతమైన జీవితానికి కేసీఆర్ స్వస్తి చెప్పాలి
  • థర్డ్ ఫ్రంట్ గురించి కేసీఆర్ మాట్లాడటం విడ్డూరం
  • నిన్న మమతాబెనర్జీని కలిసిన కేసీఆర్ కు ఆమె మొట్టికాయలు వేశారు : కోమటిరెడ్డి
సాధారణ జీవితం గడుపుతున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలని, తన విలాసవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు గుప్పించారు. మోదీకి మద్దతిస్తూ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటారేమిటంటూ నిన్న మమతా బెనర్జీని కలిసిన కేసీఆర్ కు ఆమె మొట్టికాయలు వేశారని ఆరోపించారు. అసలు, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని కోమటిరెడ్డి విమర్శించారు. 
kcr
mamata banerjee
komatireddy

More Telugu News