Kollu Ravindra: ఓవైపు థర్డ్ ఫ్రంట్ అంటారు.. మరోవైపు బీజేపీకి సపోర్ట్ గా ప్రవర్తిస్తారు: టీఆర్ఎస్ పై ఏపీ మంత్రి ఫైర్

  • అవిశ్వాసాన్ని టీఆర్ఎస్ అడ్డుకోవడం వెనుక బీజేపీ కుట్ర ఉంది
  • టీఆర్ఎస్ పద్ధతి సరిగా లేదు
  • ప్రాంతీయ పార్టీలను బీజేపీ కబళించాలనుకుంటోంది
బీజేపీ, టీఆర్ఎస్ లపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను కబళించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా, ప్రాంతీయ పార్టీలు బలపడటం ఖాయమని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ జరగకుండా అన్నాడీఎంకే, టీఆర్ఎస్ లు అడ్డుకోవడం వెనుక బీజేపీ కుట్ర దాగుందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ రావాలని చెబుతున్న టీఆర్ఎస్... ఇదే సమయంలో లోక్ సభలో బీజేపీకి మద్దతుగా వ్యవహరించడం సరైంది కాదని విమర్శించారు. ద్వంద్వ వైఖరి అవలంబించడం టీఆర్ఎస్ కు మంచిది కాదని అన్నారు. 
Kollu Ravindra
TRS
BJP
no confidence motion

More Telugu News