kerti suresh: 'మహానటి' రిలీజ్ డేట్ ఖరారు .. ఆ రోజుకున్న ప్రత్యేకత ఇదే!

  • సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ 
  • మే 9వ తేదీన భారీ రిలీజ్ 
  • అందరిలో పెరుగుతోన్న ఆసక్తి   
కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలో 'మహానటి' సినిమా రూపొందుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై .. సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా తీస్తున్న ఈ సినిమాను గురించి ఆమె అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

 గతంలో ఇదే రోజున ఇదే బ్యానర్ పై విడుదలైన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఘనవిజయాన్ని అందుకుంది. అదే రోజును 'మహానటి' విడుదల తేదీగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఆయా పాత్రల కోసం ఎంపిక చేయబడిన నటీనటుల వలన, ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. సావిత్రి వ్యక్తిగత జీవితం .. నటనా జీవితం గురించి తెలుసుకోవాలనుకునే అభిమానులకు ఈ సినిమా ద్వారా సమాధానం దొరకనుంది.  
kerti suresh

More Telugu News