Polavaram: ధైర్యముంటే ఒక్క ఆధారం బయటపెట్టు: 'పోలవరం అవినీతి'పై పవన్ కు చంద్రబాబు సవాల్

  • పోలవరంలో అక్రమాలు జరుగుతున్నాయన్న పవన్
  • సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జనసేనాని
  • ఒక్క ఆధారం బయటపెట్టాలని చంద్రబాబు సవాల్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని, సీబీఐ విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు రాష్ట్రంలో ఇప్పటివరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉందని అనుకుంటున్నానని, ఇప్పుడు వారికి జనసేన కూడా తోడైందని నిప్పులు చెరిగారు.

పూర్తి పారదర్శకతతో సాగుతున్న పోలవరం పనుల్లో అవినీతిపై పవన్ వద్ద ఏ ఆధారాలు ఉన్నాయని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ధైర్యముంటే ఒక్క ఆధారాన్ని బయట పెట్టాలని సవాల్ విసిరారు. ప్రభుత్వంపై ఉద్దేశ పూర్వకంగానే బురదజల్లే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ నేతల ప్రోద్బలంతోనే పవన్ రెచ్చిపోతున్నారని కచ్చితంగా చెప్పగలనని వ్యాఖ్యానించిన చంద్రబాబు, రాష్ట్రంలో నిర్మితమవుతున్న ఏ ప్రాజెక్టులోనూ అవినీతి జరగలేదని, తాను అవినీతిని సహించే వాడిని కాదని వెల్లడించారు.
Polavaram
Chandrababu
Pawan Kalyan

More Telugu News