Sasikala: శశికళకు అత్యవసర పెరోల్ మంజూరు... సాయంత్రం జైలు నుంచి ఇంటికి!

  • ప్రస్తుతం జైల్లో శశికళ
  • భర్త నటరాజన్ కన్నుమూత
  • పెరోల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
  • రేపు అంత్యక్రియలు
ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగున్నారన్న కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న వీకే శశికళకు పెరోల్ మంజూరైంది. శశికళ భర్త నటరాజన్ గత రాత్రి చెన్నై అపోలో ఆసుపత్రిలో కన్నుమూయగా, తనకు పెరోల్ ఇవ్వాలని శశికళ దాఖలు చేసిన పిటిషన్ ను మానవతాదృక్పథంతో పరిశీలించిన న్యాయమూర్తి పెరోల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.

నేటి సాయంత్రం 4 గంటలకు ఆమె జైలు నుంచి బయటకు వస్తుందని, ఆపై నేరుగా చెన్నై చేరుకుంటారని, రేపు తంజావూరులో జరిగే భర్త నటరాజన్ అంత్యక్రియల్లో పాల్గొంటారని తెలుస్తోంది. కాగా, ఆమెకు ఎన్ని రోజుల పెరోల్ మంజూరయిందన్న విషయంపై స్పష్టత రాలేదు. న్యాయమూర్తి ఆదేశాలను కాగితాల రూపంలో కోర్టు నుంచి తీసుకెళ్లి జైలు అధికారులకు అందించి, లాంఛనాలు పూర్తి చేసేందుకు మధ్యాహ్నం వరకూ సమయం పట్టవచ్చని శశికళ తరఫు న్యాయవాదులు వెల్లడించారు. 
Sasikala
Natarajan
Jail
Perole

More Telugu News