Andhra Pradesh: దయచేసి నా మాట వినండి.. రాజకీయ పార్టీలకు జగన్ విజ్ఞప్తి!

  • ప్రత్యేక హోదా ఏపీకి లైఫ్ లైన్
  • అవిశ్వాసంపై చర్చకు సహకరించండి
  • ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది
ప్రత్యేక హోదా ఆంధ్రరాష్ట్రానికి లైఫ్ లైన్ అని, అన్ని పార్టీలూ అత్యంత కీలకమైన అవిశ్వాస తీర్మానంపై చర్చకు సహకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని, దీనిపై చర్చ సాగకుండా బీజేపీ చూస్తోందని, ఇతర పార్టీలు లేవనెత్తుతున్న అంశాల గురించి తనకు అవగాహన ఉందని, అయితే ప్రత్యేక హోదాపై చర్చను అడ్డుకోవద్దని కోరుతున్నానని కోరారు. తన మాట వినాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఇదే పార్లమెంట్ లో హోదాపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Andhra Pradesh
YSRCP
Jagan
Lok Sabha

More Telugu News