Cricket: ఆఖరి ఓవర్ చివరి బంతిని నేనెన్నటికీ మరువను: డీకే

  • చివరి బంతిని సిక్సర్ గా మలచి, జట్టుకి విజయం అందించిన దినేష్ కార్తీక్
  • 8 బంతుల్లో 29 పరుగులు చేసిన డీకే
  • ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డీకే
సుదీర్ఘ కెరీర్ లో రాని గుర్తింపు నిదహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌ తో జరిగిన ఫైనల్ లో చివరి బంతిని సిక్సర్ గా మలచడం ద్వారా దినేష్ కార్తీక్ సొంతం చేసుకున్నాడు. భారత్ ఓటమి ఖరారు అనుకున్న దశలో బ్యాటింగ్ కు వచ్చిన డీకే ఆకాశమే హద్దుగా చెలరేగి 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన తరుణంలో కేవలం 8 బంతుల్లో 29 పరుగులు చేసి జట్టుకు చిరస్మరణీయమైన విజయం అందించాడు.

దానిపై దినేశ్ కార్తీక్ స్పందిస్తూ, చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ఇలాంటి ప్రదర్శనలు జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పాడు. తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. చివరి ఓవర్ ఆఖరి బంతిని తానెన్నటికీ మర్చిపోనని దినేష్ కార్తీక్ తెలిపాడు.
Cricket
team india
dinesh kartik

More Telugu News