Jagan: మోదీకి కోవర్టులుగా వ్యవహరిస్తున్న జగన్ - పవన్!: మంత్రి అచ్చెన్నాయుడు
- ‘హోదా’ హామీ మోదీ ఇవ్వలేదన్న పవన్ వ్యాఖ్యలు విడ్డూరం
- కేంద్ర ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నారు
- మోదీకి వ్యతిరేకంగా పవన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు
- విమర్శలు గుప్పించిన అచ్చెన్నాయుడు
ప్రధాని మోదీకి జగన్, పవన్ లు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా హామీని మోదీ ఇవ్వలేదని పవన్ అనడం విడ్డూరంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఆయన చదివారని అన్నారు. మోదీకి వ్యతిరేకంగా పవన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగకూడదనే అభిప్రాయం పవన్ మాటల్లో కనిపిస్తోందని దుయ్యబట్టారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీనే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లను నియమించారని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పవన్ మార్కులేస్తున్నారని, అసలు, పవన్ మార్కులెవరికి కావాలంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మరో మంత్రి నారాయణ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ రోజుకో ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని, కేంద్ర ప్రభుత్వమే ఆయనతో నాటకమాడిస్తోందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వెళ్తానన్న పవన్ ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.