Jagan: జగన్ తో బీజేపీ కలుస్తుందని నేను అనుకోవట్లేదు : ఉండవల్లి అరుణ్ కుమార్

  • 2014లోనే కలిసి పోటీ చేద్దామని వైసీపీని బీజేపీ అడిగింది
  • జగన్ ఓటు బ్యాంకు మైనార్టీస్, షెడ్యూల్ కులాలు
  • ఇందులో చాలా మంది బీజేపీకి వ్యతిరేకం
  • ఇప్పుడూ అదే పరిస్థితి : రాజకీయవేత్త ఉండవల్లి
వచ్చే ఎన్నికల్లో జగన్ తో కలిసి బీజేపీ కలిసి ముందుకు వెళ్తుందని తాను అనుకోట్లేదని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘2014లోనే కలిసి పోటీ చేద్దామని వైసీపీని బీజేపీ అడిగింది. ఆ విధంగా చేసినట్టయితే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయేవాడు. అప్పుడు, జగన్ ఒప్పుకోలేదు. జగన్ ఓటు బ్యాంకు మైనార్టీస్, షెడ్యూల్ కులాలు. ఇందులో చాలా మంది బీజేపీకి వ్యతిరేకం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనుక, జగన్ తో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని నేను అనుకోవట్లేదు’ అని అన్నారు.
Jagan
Undavalli
bjp

More Telugu News