Jagan: జగన్ ని, పవన్ కల్యాణ్ ని కలిపేంత సమర్థత నాకు లేదు: ఉండవల్లి అరుణ్ కుమార్

  • అంతా ఒట్టిదే. నేను అంత ఆలోచన చేయలేదు
  • ఇప్పుడు జరుగుతున్నదంతా పెద్ద బిజినెస్
  • ఓ ఇంటర్వ్యూలో ఉండవల్లి
వైసీపీ అధినేత జగన్ ని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కలిపేంత సమర్థత తనకు లేదని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ‘2019 ఎన్నికల నేపథ్యంలో జగన్ ని, పవన్ ని కలిపే ప్రయత్నాలు మీరు చేస్తున్నారటగా?’ అనే ప్రశ్నకు ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన సమాధానిమిస్తూ, ‘అంతా ఒట్టిదే. నేను అంత ఆలోచన చేయలేదు. వారిని కలిపేంత సమర్థత నాకు లేదు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలన్నీ పెద్ద బిజినెస్.

ఈ ఏడాది బడ్జెట్ లో జీతాలకు పోను మిగిలేది లక్షా పదివేల కోట్లు. దీని కోసమే ఈ దెబ్బలాట అంతా! దీనిపై పెత్తనం చంద్రబాబునాయుడు చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? ఈ పెత్తనం చేయడం కోసం ఈ ఫైటింగ్ జరుగుతోంది. ఆ పెత్తనం చేసే క్రమంలో కొంత పర్సంటేజ్ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్లకు వస్తుంది. దాన్ని వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెడతారు. కాంట్రాక్టర్లు రూలింగ్ పార్టీకి రూపాయి ఇస్తే, అపోజిషన్ పార్టీకి అర్ధరూపాయి ఇస్తారు’ అని చెప్పుకొచ్చారు.
Jagan
Pawan Kalyan

More Telugu News